కార్తీక మాసం కథ(Story)
పూర్వం నైమిశారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు
సత్కరించి, సంతుష్టుని చేసి, కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్హి శానకాదులారా! మా గురువుగా రైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి వున్నారు. ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలామణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మ చే పద్మ పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున – ప్రతి రోజూ నిత్య పారాయణగా – ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము.
ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను – వినండి’ అంటూ చెప్పసాగాడు
పూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యార్థియైన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి – ‘హే బ్రహ్మర్షీ! మీ యగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాసం అత్యంత మహఇమాన హిమాన్వితమైనదనీ, తద్క్వతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదనీ చెబుతూ వుంటారు గదా! ఆ నెలకు అంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది’ అని అడుగగా – మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు, జ్ఞాన హాసమును చేసతూ, ఇలా ప్రవంచినాడు.
- Please visit us to learn more about 12 Jyotirlinga Name and Place
Free Download of కార్తీక మాసం కథ
Please visit us to learn more about Devotional and Information.