Vinayaka Chavithi Katha in Telugu

Vinayaka Chavithi Katha in Telugu – వినాయక చవితి కథ ప్రారంభము

Vinayaka Chavithi Katha in Telugu – వినాయక చవితి పూజా విధానం

 • శ్రీ మహాగణాధిపతయే నమః |
 • శ్రీ గురుభ్యో నమః |
 • హరిః ఓం |

శుచిః Vinayaka Chavithi Katha in Telugu

(తలమీద నీళ్ళను జల్లుకోండి)

 • అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
  యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
  పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||

(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)

 • శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
  ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే ||

ఆచమ్య: Vinayaka Chavithi Katha in Telugu

 • ఓం కేశవాయ స్వాహా |
 • ఓం నారాయణాయ స్వాహా |
 • ఓం మాధవాయ స్వాహా |
 • ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
 • ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
 • ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
 • ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
 • ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
 • ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
 • ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
 • ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
 • ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
 • ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
 • ఓం శ్రీ కృష్ణాయ నమః |

దీపారాధనం: Vinayaka Chavithi Katha in Telugu

(దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి)

 • దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
  సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||
 • భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ |
  యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||
 • దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
  పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||

భూతోచ్ఛాటనం: Vinayaka Chavithi Katha in Telugu

(అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది చదివి, మీ వెనుక వేసుకోండి)

 • ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
  ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే |
 • అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
  యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా |

ప్రాణాయామం: Vinayaka Chavithi Katha in Telugu

(ప్రాణాయామం చేయండి)

 • ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
 • ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
 • ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
 • ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

Vinayaka Chavithi Katha in Telugu – సంకల్పం

(అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి)

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ శోభకృతు (2023) నామ సంవత్సరే ఉత్తర/దక్షిణ/పశ్చిమ/ఈశాన్య ఆయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం తిథౌ ___ వాసరే ___ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః (మమ ధర్మపత్నీ సమేతః) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ||

|| వినాయక పూజా ప్రారంభః ||

ప్రార్థన: Vinayaka Chavithi Katha in Telugu

 • భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ |
  విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ||
 • ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ |
  పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ||
 • ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ |
  భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ||

ధ్యానం: Vinayaka Chavithi Katha in Telugu

 • ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ |
  చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం: Vinayaka Chavithi Katha in Telugu

 • అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
  అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి |

ఆసనం: Vinayaka Chavithi Katha in Telugu

 • మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ |
  రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి |

అర్ఘ్యం: Vinayaka Chavithi Katha in Telugu

 • గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన |
  గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి |

పాద్యం: Vinayaka Chavithi Katha in Telugu

 • గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక |
  భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి |

ఆచమనీయం: Vinayaka Chavithi Katha in Telugu

 • అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
  గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం: Vinayaka Chavithi Katha in Telugu

 • దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ |
  మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం: Vinayaka Chavithi Katha in Telugu

 • స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
  అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం: Vinayaka Chavithi Katha in Telugu

 • గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః |
  స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
  స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం: Vinayaka Chavithi Katha in Telugu

 • రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ |
  శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం: Vinayaka Chavithi Katha in Telugu

 • రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ |
  గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం: Vinayaka Chavithi Katha in Telugu

 • చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
  విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి |

అక్షతాన్: Vinayaka Chavithi Katha in Telugu

 • అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
  గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |

పుష్పాణి: Vinayaka Chavithi Katha in Telugu

 • సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ |
  ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి |

అథాంగపూజా: Vinayaka Chavithi Katha in Telugu

 • ఓం పార్వతీనందనాయ నమః | పాదౌ పూజయామి (పాదములను) |
 • ఓం గణేశాయ నమః | గుల్ఫౌ పూజయామి (చీలమండను) |
 • ఓం జగద్ధాత్రే నమః | జంఘే పూజయామి (మోకాలుక్రింద) |
 • ఓం జగద్వల్లభాయ నమః | జానునీ పూజయామి (మోకాలు చిప్ప) |
 • ఓం ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి (తొడలను) |
 • ఓం వికటాయ నమః | కటిం పూజయామి (నడుమును పూజింపవలెను) |
 • ఓం గుహాగ్రజాయ నమః | గుహ్యం పూజయామి (మర్మ స్థానములను) |
 • ఓం మహోత్తమాయ నమః | మేఢ్రం పూజయామి |
 • ఓం నాథాయ నమః | నాభిం పూజయామి (బొడ్డును) |
 • ఓం ఉత్తమాయ నమః | ఉదరం పూజయామి (పొట్టను) |
 • ఓం వినాయకాయనమః | వక్షఃస్థలం పూజయామి (ఛాతిని) |
 • ఓం పాశచ్ఛిదేనమః | పార్శ్వే పూజయామి (పక్కలను) |
 • ఓం హేరంబాయ నమః | హృదయం పూజయామి (హృదయము) |
 • ఓం కపిలాయనమః | కంఠం పూజయామి (కంఠమును) |
 • ఓం స్కందాగ్రజాయ నమః | స్కంధౌ పూజయామి (భుజములను) |
 • ఓం హరసుతాయ నమః | హస్తౌ పూజయామి (చేతులను) |
 • ఓం బ్రహ్మచారిణే నమః | బాహున్ పూజయామి (బాహువులను) |
 • ఓం సుముఖాయ నమః | ముఖం పూజయామి (ముఖమును) |
 • ఓం ఏకదంతాయ నమః | దంతౌ పూజయామి (దంతములను) |
 • ఓం విఘ్ననేత్రే నమః | నేత్రే పూజయామి (కన్నులను) |
 • ఓం శూర్పకర్ణాయనమః | కర్ణౌ పూజయామి (చెవులను) |
 • ఓం ఫాలచంద్రాయనమః | లలాటం పూజయామి (నుదురును) |
 • ఓం నాగాభరణాయనమః | నాసికాం పూజయామి (ముక్కును) |
 • ఓం చిరంతనాయ నమః | చుబుకం పూజయామి (గడ్డము క్రింది భాగమును) |
 • ఓం స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠౌ పూజయామి (పై పెదవిని) |
 • ఓం గళన్మదాయ నమః | గండే పూజయామి (గండమును) |
 • ఓం కపిలాయ నమః | కచాన్ పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును) |
 • ఓం శివప్రియాయై నమః | శిరః పూజయామి (శిరస్సును) |
 • ఓం సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని పూజయామి (సర్వ అవయవములను) |

Vinayaka Chavithi Katha in Telugu: ఏకవింశతి పత్ర పూజ (21 ఆకులు)

 • ఓం ఉమాపుత్రాయ నమః | మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
 • ఓం హేరంబాయ నమః | బృహతీపత్రం సమర్పయామి (నేలములక) |
 • ఓం లంబోదరాయ నమః | బిల్వపత్రం సమర్పయామి (మారేడు) |
 • ఓం ద్విరదాననాయ నమః | దూర్వాపత్రం సమర్పయామి (గరిక) |
 • ఓం ధూమకేతవే నమః | ధత్తూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త) |
 • ఓం బృహతే నమః | బదరీపత్రం సమర్పయామి (రేగు) |
 • ఓం అపవర్గదాయ నమః | అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
 • ఓం ద్వైమాతురాయ నమః | తులసీపత్రం సమర్పయామి (తులసి) |
 • ఓం చిరంతనాయ నమః | చూతపత్రం సమర్పయామి (మామిడి ఆకు) |
 • ఓం కపిలాయ నమః | కరవీరపత్రం సమర్పయామి (గన్నేరు) |
 • ఓం విష్ణుస్తుతాయ నమః | విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
 • ఓం ఏకదంతాయ నమః | దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ) |
 • ఓం అమలాయ నమః | ఆమలకీపత్రం సమర్పయామి (దేవదారు) |
 • ఓం మహతే నమః | మరువక పత్రం సమర్పయామి (మరువము) |
 • ఓం సింధూరాయ నమః | సింధువార పత్రం సమర్పయామి (వావిలి) |
 • ఓం గజాననాయ నమః | జాతీ పత్రం సమర్పయామి (జాజిపత్రి) |
 • ఓం గండగళన్మదాయ నమః | గండవీ పత్రం సమర్పయామి (తెల్లగరికె) |
 • ఓం శంకరప్రియాయ నమః | శమీ పత్రం సమర్పయామి (జమ్మి) |
 • ఓం భృంగరాజత్కటాయ నమః | అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి) |
 • ఓం అర్జునదంతాయ నమః | అర్జునపత్రం సమర్పయామి (మద్ది) |
 • ఓం అర్కప్రభాయ నమః | అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు) |

Vinayaka Chavithi Katha in Telugu: ఏకవింశతి పుష్ప పూజ – (21 పుష్పాలు)

 • ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి |
 • ఓం మహా గణపతయే నమః | మందార పుష్పం సమర్పయామి |
 • ఓం ధీర గణపతయే నమః | దాడిమీ పుష్పం సమర్పయామి |
 • ఓం విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం సమర్పయామి |
 • ఓం ఆమోద గణపతయే నమః | అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి |
 • ఓం ప్రమథ గణపతయే నమః | పాటలీ పుష్పం సమర్పయామి |
 • ఓం రుద్ర గణపతయే నమః | ద్రోణ పుష్పం సమర్పయామి |
 • ఓం విద్యా గణపతయే నమః | ధత్తూర పుష్పం సమర్పయామి |
 • ఓం విఘ్న గణపతయే నమః | చంపక పుష్పం సమర్పయామి |
 • ఓం దురిత గణపతయే నమః | రసాల పుష్పం సమర్పయామి |
 • ఓం కామితార్థప్రద గణపతయే నమః | కేతకీ పుష్పం సమర్పయామి |
 • ఓం సమ్మోహ గణపతయే నమః | మాధవీ పుష్పం సమర్పయామి |
 • ఓం విష్ణు గణపతయే నమః | శమ్యాక పుష్పం సమర్పయామి |
 • ఓం ఈశ గణపతయే నమః | అర్క పుష్పం సమర్పయామి |
 • ఓం గజాస్య గణపతయే నమః | కల్హార పుష్పం సమర్పయామి |
 • ఓం సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా పుష్పం సమర్పయామి |
 • ఓం వీర గణపతయే నమః | బిల్వ పుష్పం సమర్పయామి |
 • ఓం కందర్ప గణపతయే నమః | కరవీర పుష్పం సమర్పయామి |
 • ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః | కుంద పుష్పం సమర్పయామి |
 • ఓం బ్రహ్మ గణపతయే నమః | పారిజాత పుష్పం సమర్పయామి |
 • ఓం జ్ఞాన గణపతయే నమః | జాతీ పుష్పం సమర్పయామి |

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)

 • ఓం గణాధిపాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం పాశాంకుశధరాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం ఆఖువాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం వినాయకాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం ఈశపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం ఏకదంతాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం ఇభవక్త్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం మూషకవాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం కుమారగురవే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం కపిలవర్ణాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం బ్రహ్మచారిణే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం మోదకహస్తాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం సురశ్రేష్ఠాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం గజనాసికాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం కపిత్థఫలప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం గజముఖాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం సుప్రసన్నాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం సురాగ్రజాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం ఉమాపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
 • ఓం స్కందప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి |

అష్టోత్తరశతనామ పూజ

శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళీ

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

ధూపం

 • దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ |
  ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం

 • సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
  గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి |

నైవేద్యం

 • సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
  నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
 • భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ |
  ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |

తాంబూలం

 • పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ |
  కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
  తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి |

నీరాజనం

 • ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా |
  నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి |
 • నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం

 • గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన |
  వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ||
 • ఏకదంతైకవదన తథా మూషకవాహన |
  కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణం

 • ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
  మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ||
 • ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
  ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||
 • యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
  తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
 • పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
  త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
 • అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
  తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం

 • నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
  నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ||
 • అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
  అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
 • నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
  మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు తే ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి |

ప్రార్థన – Vinayaka Chavithi Katha in Telugu

 • ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
  ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ||
 • వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ |
  అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |

రాజోపచార పూజా – Vinayaka Chavithi Katha in Telugu

 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఛత్రమాచ్ఛాదయామి |
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | చామరైర్వీజయామి |
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గీతం శ్రావయామి |
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | నృత్యం దర్శయామి |
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | వాద్యం ఘోషయామి |
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఆందోళికాన్ ఆరోహయామి |
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | అశ్వాన్ ఆరోహయామి |
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గజాన్ ఆరోహయామి |
 • ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

పునరర్ఘ్యం – Vinayaka Chavithi Katha in Telugu

 • అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
  గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ||
 • నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక |
  పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
 • నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
  యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
 • గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
  గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

సమర్పణం – Vinayaka Chavithi Katha in Telugu

 • యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
  న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ||
 • మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక |
  యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

శ్రీ వినాయక చవితి కథ ప్రారంభము – Vinayaka Chavithi Katha in Telugu

మున్ను నైమిశారణ్యంబున సత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు సకలకథావిశారదుడగు సూతమహాముని యొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, శాపమోక్షప్రకారంబును చెప్పదొడంగెను.

గజాసుర వృత్తాంతం – Vinayaka Chavithi Katha in Telugu

పూర్వము గజరూపముతో నున్న రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్ప, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్ష్యమై వరంబు కోరుమన, గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి “స్వామీ! మీరు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి కాపాడుచుండు”డని కోరగా భక్తసులభుండగు నా మహేశ్వరుండాతని కోర్కెదీర్ప గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుగ నుండె.

కైలాసమున పార్వతీదేవి భర్తజాడ దెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంతకాలంబునకు గజాసురగర్భస్థుడగుట తెలిసి రప్పించుకొనుమార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతివృత్తాంతమును దెలిపి, “యో మహానుభావ!

పూర్వము భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నాకొసంగితివి. ఇప్పుడుగూడ నుపాయాంతరముచే రక్షింపు” మని విలపింప హరి యాపార్వతీదేవి నూరడించి కైలాసంబున నుండుమని దెల్పి యంత నా హరియు బ్రహ్మాదిదేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి, పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దుగ నలంకరించి, బ్రహ్మాదిదేవతలందరిని విచిత్ర వాద్యముల ధరింపచేసి తానును చిరుగంటలు, సన్నాయిని దాల్చి గజాసురపురంబు జొచ్చి అందందు జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుండు విని, వారలబిలిపించి తన భవనము నెదుట నాడించ నియమించగా బ్రహ్మాదిదేవతలు తమవాద్యవిశేషంబులు భోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు నాహరి చిత్రవిచిత్రగతుల గంగిరెద్దు నాడించగా గజాసురుండు పరమానందభరితుడై “మీకేమి కావలయునో కోరుడొసంగెద”నన, హరి సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకువచ్చె గాన శివునొసంగు” మని పల్కె.

ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుండగు శ్రీహరిగా నెరింగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని దలచి “నా శిరస్సు త్రిలోకపూజ్యముగ చేసి, నాచర్మమును నీవు ధరింపవే”యని ప్రార్థించి, విష్ణుమూర్తికి తన అంగీకారము దెలుప నాతండు నందిని ప్రేరేపించె. నందియు తన శృంగమ్ములచే గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుండు గజాసుర గర్భమునుండి వెలువడివచ్చి విష్ణుమూర్తిని స్తుతించె. అంత నా హరియు “దుష్టాత్ములకిట్టి వరంబులీయరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు”నని యుపదేశించి ఈశ్వరుని, బ్రహ్మాది దేవతలను వీడ్కోలిపి, తాను వైకుంఠమ్మున కెరిగె. అంత శివుండును నందినెక్కి కైలాసంబున కతివేగంబుగ జనియె.

వినాయకోత్పత్తి – Vinayaka Chavithi Katha in Telugu

కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదులవలన విని ముదమంది, అభ్యంగనస్నానమాచరించుచు నలుగుబిండి నొక బాలునిగజేసి, ప్రాణంబొసంగి, వాకిలి ద్వారమున కావలియుంచి, పార్వతి స్నానమాడి, సర్వాభరణములు అలంకరించుకొనుచు పత్యాగమనమును నిరీక్షించుచుండె. అంత పరమేశ్వరుండు కైలాసమందిరమునకు వచ్చి, నందినవరోహించి లోనికిపోబోవ వాకిలిద్వారమందున్న బాలకుడడ్డగింప, కోపావేశుండై త్రిశూలంబుచే బాలకుని కంఠంబుదునిమి లోనికేగె.

అంత పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులపూజించె; నంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము రాగా, అంత నమ్మహేశ్వరుండు తానొనరించినపనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు నాబాలుని కతికించి ప్రాణంబొసంగి గజాననుడను నామంబొసంగి యాతని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండె. గజాననుండును సులభముగ నెక్కితిరుగుటకు అనింద్యుడను నొక ఎలుకను వాహనముగా చేసికొనియె.

కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జనియించె. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతి గాంచియుండెను.

విఘ్నేశాధిపత్యము – Vinayaka Chavithi Katha in Telugu

ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసంబునకేగి పరమేశ్వరుని సేవించి, విఘ్నముల కొక్కని అధిపతిగా తమకొసంగుమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడనుగనుక ఆ యాధిపత్యము తన కొసంగమనియు; గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు గాన ఇయ్యాధిపత్యంబు తన కొసంగుమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంత నక్కుమారులజూచి “మీలో నెవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నెవరు నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యంబొసంగుదు”నని మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలివాహనమెక్కి వాయువేగంబుననేగె.

అంత గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి “అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయదగునే? మీపాదసేవకుండను. నాయందు కటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి రక్షింపవే” యని ప్రార్ధింప, మహేశ్వరుండు దయాళుడై “సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం! గంగాదిసర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక.” “కుమారా! ఒకసారి నారాయణమంత్రమును బఠించిన మాత్రమున మూడువందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమొనర్చినవాడగును” అని సక్రమముగ నారాయణమంత్రంబుపదేశింప, గజాననుడు నత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసమ్మునుండె.

అమ్మంత్రప్రభావంబున అంతకు పూర్వము గంగా నదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నది లో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోగూడ నటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబునకేగి యచటగూడ తండ్రిసమీపమందున్న గజాననుని గాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుడు. తమ నిర్ణయంబు ననుసరించి యీ ఆధిపత్యము అన్నగారికే యొసగు” మని ప్రార్థించె.

అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థీనాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు, మొదలుగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహమునకొసంగియు, కొన్ని చేతధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబునకేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమికానిన చేతులు భూమికందవయ్యె. బలవంతముగ చేతులానింప చరణంబు లాకసంబుజూచె. ఇట్లు దండప్రణామంబు సేయ గడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటముగ నవ్వె. నంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లెడల దొర్లె. నతండును మృతుండయ్యె.

అంత పార్వతి శోకించుచు చంద్రుని జూచి, “పాపాత్ముడా! నీదృష్టి తగిలి నా కుమారుడు మరణించెగాన, నిన్ను జూచినవారు పాపాత్ములై నిరాపనింద నొందుదురుగాక” యని శపించెను.

ఋషిపత్నులకు నిరాపనింద కలుగుట – Vinayaka Chavithi Katha in Telugu

ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబుచేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను జూచి మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండ నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపముదక్క తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబుసేయ, ఋషులద్దానిం గనుంగొని అగ్నిదేవునితో నున్నవారు తమభార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నిరాపనింద కలిగినది. దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపంబుదాల్చి వచ్చుట దెల్పి సప్తమహర్షులను సమాధానపరచి వారితోగూడ బ్రహ్మ కైలాసంబునకేతెంచి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు “ఓ దేవీ! పార్వతీ! నీవొసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడువాటిల్లెగాన దాని నుపసంహరింపు”మని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయె కుమారునిజేరదీసి ముద్దాడి “ఏదినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వె నాదినంబున చంద్రుని జూడరాదు” అని శాపావకాశం బొసంగె. అంత బ్రహ్మాదిదేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థీయందు మాత్రము చంద్రునింజూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇట్లు కొంతకాలంబు గడచె.

శమంతకోపాఖ్యానము – Vinayaka Chavithi Katha in Telugu

ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు “స్వామీ! సాయం సమయమయ్యె. ఈనాడు వినాయకచతుర్థిగాన పార్వతీశాపంబుచే చంద్రునిం జూడరాదుగనుక నిజగృహంబుకేగెద సెలవిండు” అని పూర్వవృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికి దెల్పి నారదుడు స్వర్గలోకంబునకేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుననెవ్వరు చూడరాదని పట్టణమున చాటింపించెను. నాటిరాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తాను మింటివంక చూడక గోష్ఠమునకుబోయి పాలుపితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి “ఆహా! ఇక నాకెట్టి యపనింద రానున్నదో” యని సంశయమున నుండెను.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్ధమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద జేసి ఆ మణిని మన రాజుకిమ్మని యడిగిన, అతడు “ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిదీ మణి. ఎంతటి యాప్తునకే మందమతైననిచ్చునా” యని పలికిన పోనిమ్మని కృష్ణుడూరకుండెను. అంత నొకనాడా సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుండా శమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవికిజన నొక సింహమా మణిని మాంసఖండమని భ్రమించి వానిని జంపి యా మణిని గొనిపోవుచుండ, నొక భల్లూకమా సింహమును దునిమి యా మణింగొని తన కొండబిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెకు ఆటవస్తువుగ నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని “కృష్ణుండు మణి యివ్వలేదను కారణమున నా సోదరుని జంపి రత్నమపహరించె” నని పట్టణమున చాటె. అది కృష్ణుండు విని “ఆహా! నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోషఫలం బిటుల కలిగిన” దని యెంచి దానిం బాపుకొన బంధుజన సేనాసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా నొక్కచో ప్రసేన మృత కళేబరంబును, సింగపు కాలిజాడలను, పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను.

ఆ దారింబట్టి పోవుచుండ నొక పర్వతగుహలోనికీ చిహ్నములు గాన్పింప నంత గుహద్వారమువద్ద పర్వారమ్మునుంచి, కృష్ణుండు గుహలోపలకేగి అచట మిరుమిట్లుగొల్పుచు బాలిక ఊయెల పై కట్టబడియున్న మణింజూచి అచ్చటకు మెల్లనజని ఆ మణిని చేతపుచ్చుకుని వచ్చునంత ఊయలలోని బాలిక ఏడ్వదొడంగెను. అంత దాదియును వింతమానిషి వచ్చెననుచు కేకలు వేయ నది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై, చనుదెంచి శ్రీకృష్ణునిపైబడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరలు గొరకుచు, ఘోరముగ యుద్ధముచేయ, కృష్ణుండును వానిం బడద్రోసి, వృక్షంబులచేతను, రాళ్ళచేతను, తుదకు ముష్టిఘాతములచేతను రాత్రింబవళ్ళు యెడతెగక యిరువదెనిమిది దినములు యుద్ధమొనర్ప, జాంబవంతుడు క్షీణబలుండై, దేహంబెల్ల నొచ్చి భీతిచెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి ఘటించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా! నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను
పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితి; ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొనుమని ఆజ్ఞ యొసంగ నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు జేయవలెనని కోరుకొంటిని. కాలాంతరమున నిది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచు నిటనుండ నిపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరంబంతయు శిథిలమయ్యెను ప్రాణములుకడబెట్టె. జీవితేచ్ఛ నశించె. నా యపరాధములు క్షమించి కాపాడుము నీకన్న వేరుదిక్కులేదు” అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయముంబాపి “భల్లుకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపైనారోపించిన యపనింద బాపుకొనుటకిటువచ్చితి గాన మణినొసంగిన నేనేగెద” నని జాంబవంతునకు దెల్ప నతడు శ్రీకృష్ణునకు మణిసహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగి రక్షింపవేడ నాతని కభయమొసంగి, కృష్ణుడు గుహవెల్వడి తన యాలస్యమునకు పరితపించు బంధు మిత్ర సైన్యంబుల కానందంబు కలిగించి కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరే.

సభాస్థలికి పిన్న పెద్దలను జేర్చి సత్రాజిత్తును రావించి యావద్వృత్తాంతమును దెల్పి యాతనికి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు “అయ్యో! పరమాత్ముడగు శ్రీకృష్ణునిపై లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి” నని చాల విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను. అంత శ్రీకృష్ణుండును, సత్యభామను గైకొని సంతోషించి “ఇతర మణులేల? మాకు భామామణి చాలును. సూర్యవరప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే యుంచుకొనుము. మాకు వలదు” అనుచు మణిని సత్రాజిత్తునకొసంగి యాదరించెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి, సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనక నిరాపనింద బాపుకొంటిరి. మా కేమిగతి”యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపదశుద్ధ చతుర్థిన ప్రమాదంబున చంద్రదర్శనమయ్యె నేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నిరాపనింద నొందకుండెదరు గాక” అని ఆనతీయ దేవాదులు “అనుగ్రహించబడితి” మని ఆనందించుచు తమ తమ నివాసములకేగి ప్రతి సంవత్సరమున భాద్రపదశుద్ధ చతుర్థీ యందు దేవతలు, మహర్షులు, మానవులు మున్నగువారందరు తమ తమ విభవములకొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి గాంచుచు సుఖముగ నుండిరని శాపమోక్ష ప్రకారము శౌనకాదిమునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగె.

గమనిక : చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

 • సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః |
  సుకుమారకమారోదీః తపహ్యేష శమంతకః ||

సర్వేజనాస్సుఖినోభవంతు |

శ్రీ వినాయక దండకం – Vinayaka Chavithi Katha in Telugu

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబు నీ కరలంబు నీ పెద్ద వక్త్రంబు నీ పాద హస్తంబు లంబో దరంబున్ సదమూషకాశ్వంబు నీ మంద హాసంబు నీచిన్న తొండంబు నీ గుజ్జ రూపంబు నీ సూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమంబక్ష తాల్జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్మోల్లులు న్ముంఛి చేమంతులున్ దేల్లగాన్నేరులున్ మంకెనలన్ పోన్నలన్ పువ్వులు న్మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి విఘ్నేశ్వరా నీకుతేంకాయ పోన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులన్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోదుమప్పంబులు న్వడల్ పునుగులున్భూరేలున్ న్గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్ను బాలాజ్యము న్నాను బియ్యంచామ్రంబు బిల్వంబు మేల్ బంగురున్ బల్లెమందుంచి నైవేద్య బంచనీరానంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా!

నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల సేయుటల్ కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ ! యోభక్తమందార ! యోసుందరాకారా ! యోభాగ్య గంభీర ! యోదేవ చూడామణీ లోక రక్షా మణీ ! బందు చింతామణీ !

స్వామీ నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీ దొంతరాజాన్వ వాయుండ రామాబిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూడతన్ నిల్పి కాపాడుటేకాడు విన్గోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గోంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృహన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా !

నమస్తే నమస్తే నమస్తే నమః ||

ఇతి శ్రీ వినాయక దండకం ||

శ్రీ వినాయక మంగళ హారతి – Vinayaka Chavithi Katha in Telugu

 • శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు- వాసిగల దేవతావంద్యునకును |
  ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి – భూసురోత్తమ లోకపూజ్యునకును ||
  | జయ మంగళం నిత్య శుభ మంగళం |
 • నేరేడు మారేడు నెలవంక మామిడి – దూర్వార చెంగల్వ ఉత్తరేణు |
  వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||
 • సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు – పొసగ సజ్జనులచే పూజకొల్తు |
  శశిజూడరాదన్న జేకొంటి నొక వ్రతము – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||
 • పానకము వడపప్పు పనస మామిడిపండ్లు – దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు |
  తేనెతో మాగిన తియ్య మామిడిపండ్లు – మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు || జయ ||
 • ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య – ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు |
  కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును – బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు || జయ ||
 • వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు – కొండలుగ నీలములు కలియబోసి |
  మెండుగను హారములు మెడనిండ వేసికొని – దండిగా నీకిత్తు ధవళారతి || జయ ||
 • పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు – గంధాల నినుగొల్తు కస్తూరినీ |
  ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||
 • ఏకదంతంబును ఎల్లగజవదనంబు – బాగయిన తొండంబు వలపు కడుపు |
  జోకయున మూషికము సొరిదినెక్కాడుచును – భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||
 • మంగళము మంగళము మార్తాండతేజునకు – మంగళము సర్వజనవందితునకు |
  మంగళము ముల్లోక మహితసంచారునకు – మంగళము దేవగణపతికి నిపుడు || జయ ||
 • సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు – ఒనరంగ నిరువదియొక్క పత్రి |
  దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత – యుమ్మెత్త దూర్వార యుత్తరేణి |
  కలువలు మారేడు గన్నేరు జిల్లేడు – దేవకాంచన రేగు దేవదారు |
  జాజి బలురక్కసి జమ్మిదాచెనపువ్వు – గరిక మాచిపత్రి మంచిమొలక || జయ ||
 • అగరు గంధాక్షతల్ ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును |
  భాద్రపద శుద్ధచవితిని పగటివేళ కుడుములు నానుబాలు ఉండ్రాళ్ళు పప్పు
  పాయసము జున్ను దేనెను పంక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర || జయ ||
 • బంగారుచెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి |
  మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణాలింగమునకు || జయ ||
 • పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి గట్టిగా కనకములు కరులు హరులు
  ఇష్టసంపదలిచ్చి యేలినస్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు || జయ ||
 • ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి
  నిక్కముగ మనమును నీయందె నే నిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు || జయ ||
 • మల్లెలా మొల్లలా మంచిసంపెంగలా చల్లనైనా గంధసారములను
  ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నే జేతు కోరి విఘ్నేశ || జయ ||
 • దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును
  దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||
 • చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
  పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ||జయ ||
 • మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
  నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను || జయ ||
 • ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలుమీ కరుణతోను
  మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర || జయ ||

| జయ మంగళం నిత్య శుభ మంగళం |

Please visit us to learn more about Devotional and Information.

Article Source: Bhaktinidhi

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *